ETV Bharat / crime

తాగొచ్చి వేధించిన భర్త... బండరాయితో కొట్టి చంపిన భార్య - తాగొచ్చిన భర్త తలపై బండతో కొట్టి చంపిన భార్య

మద్యానికి బానిసైన భర్త... డబ్బుకోసం పెడుతున్న వేధింపులు తాళలేక ఓ మహిళ భర్త తలపై బండరాయితో కొట్టి చంపింది. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా ఇందల్వాయి మండలం చెర్లపల్లిలో జరిగింది.

women killed
నిజామాబాద్​ నేర వార్తలు,nizamabad crime news
author img

By

Published : Apr 22, 2021, 9:53 PM IST

నిజామాబాద్​ జిల్లా ఇందల్వాయి మండలం చెర్లపల్లిలో దారుణం జరిగింది. తాగొచ్చి డబ్బుకోసం వేధిస్తున్న భర్తను ఓ మహిళ హత్య చేసింది. గ్రామానికి చెందిన చాకలి సాయికుమార్, సునీత దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. మద్యానికి బానిసైన సాయికుమార్​ డబ్బుకోసం భార్యను తరచు వేధించేవాడు. ఈ క్రమంలో గురువారం కూడా భార్యతో గొడవపడ్డాడు. విసుగు చెందిన సునీత భర్త తలపై బండరాయితో కొట్టింది.

మద్యం మత్తులో ఉన్న సాయికుమార్​ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. నిందితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కొడంగల్​ పరిధిలో పిడుగుపాటుతో 32 గొర్రెలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.