ETV Bharat / crime

CYBER CRIME: పోలీసులు కౌన్సిలింగ్​ ఇచ్చినా... రూ.5 కోట్లకు ఆశపడి 25లక్షలు పొగొట్టుకుంది!

author img

By

Published : Aug 25, 2021, 9:03 AM IST

తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం అంటే నమ్మి ఓ యాప్​లో డబ్బులు పెట్టింది. ఓ రెండు మూడు సార్లు లాభాలు పొందింది. నాలుగోసారి పెట్టిన డబ్బులు కూడా రాకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఇలాంటివి నమ్మొదంటూ.. మళ్లీ డబ్బులు పెట్టవద్దని పోలీసులు హితబోధ చేశారు. సరేనని చెప్పిన ఆ యువతి ఇంటికొచ్చి... రూ.5 కోట్లపైన ఆశతో మరో పదిహేను లక్షలను రీఛార్జ్ చేసింది. మోసపోయినట్లు గ్రహించిన ఆమె మళ్లీ పోలీసుల వద్దకొచ్చింది.

a-woman-who-was-trapped-by-cybercriminals-and-suffered-heavy-losses
సైబర్‌ నేరగాళ్లకు చిక్కి పాతిక లక్షలు పోగొట్టుకున్న మహిళ

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అంటూ ఆన్‌లైన్‌లో సాగే వ్యవహారాలన్నీ మోసాలని.. వాటిలో పెట్టుబడులు పెట్టి డబ్బులు నష్టపోవద్దంటూ ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుకు పోలీసులు చేసిన హితబోధ బూడిదలో పోసిన పన్నీరైంది. అత్యాశకు పోయిన ఆ మహిళ ఇంటికి వెళ్లి సైబర్‌ నేరగాళ్ల మాయమాటలు నమ్మి రూ.25.50 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో వెలుగు చూసింది.

తక్కువ పెట్టుబడులు.. ఎక్కువ లాభాలు..

మణికొండలో నివసించే బాధితురాలు(36) ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. కొంత కాలం కిందట బిట్‌కాయిన్‌లో తక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు సంపాదించొచ్చంటూ ఇన్‌స్టాగ్రాంలో ప్రకటన చూశారు. ఆపై ఓ యాప్‌లో రిజిస్టర్‌ అయ్యి తొలుత రూ.5వేలకు రూ.2,500 లాభం పొందారు. ఆ తర్వాత మరో రూ.5వేలకు రూ.2,500.. మళ్లీ రూ.50వేలకు రూ.25వేలు లాభం గడించారు. ఈ లాభాలను ఆమె విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో ఆమెకు నమ్మకం పెరిగి ఓ రోజు రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టారు. రూ.2.5 కోట్లు లాభం వచ్చినట్లుగా యాప్‌లో కనిపించింది.

మరో పది లక్షలు కడితే రూ.5 కోట్లు మీవే..

ఆ డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు యత్నించగా సాధ్యపడలేదు. ఎందుకిలా జరుగుతోందంటూ యాప్‌ కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేశారు. మరో రూ.10 లక్షలు రీఛార్జ్‌ చేస్తే.. మొత్తం లాభం రూ.5 కోట్లు అవుతుందని వారు వివరించారు. ఆమెకు అనుమానమొచ్చి సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఆరా కోసం వచ్చారు. అక్కడ ఆమెకు ఇలాంటివి నమ్మొద్దంటూ ఆర్థిక నేరాల విభాగానికి చెందిన ఓ ఇన్‌స్పెక్టర్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. ఇంటికెళ్లిన ఆమెకు రెండు, మూడుసార్లు సదరు కంపెనీ ప్రతినిధులు ఫోన్‌ చేశారు. ఇంకో రూ.10 లక్షలు కడితే.. రూ.5 కోట్లు మీవేనంటూ నమ్మకం కలిగించారు.

పది లక్షలు రీఛార్జ్.. మరో ఐదు లక్షలు ఛార్జీల పేరిట...

దీంతో ఆమె మరో రూ.10 లక్షలు రీఛార్జ్‌ చేశారు. ఆ తరువాత వివిధ రకాల ఛార్జీల పేరిట మరో రూ.5.50 లక్షలు వసూలు చేశారు. చివరకు 15 శాతం పన్ను కడితేనే విత్‌డ్రా చేసుకోవచ్చంటూ తేల్చి చెప్పారు. ఆమెకు అనుమానమొచ్చి మళ్లీ సైబరాబాద్‌ కమిషనరేట్‌కు రావడంతో సైబర్‌క్రైం పోలీసులు కంగుతిన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులు ప్రైవేటు అజమాయిషీలోకి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.