ఏపీలోని అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం మంగళ మడక గ్రామంలో పెద్ద శబ్దంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలింది. నివాసాల మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలడంతో విద్యుదాఘాతానికి గురై.. ప్రమీలమ్మ అనే మహిళ మృతి చెందింది. భారీ శబ్దంతో పేలడం వల్ల.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో గ్రామంలోని విద్యుత్ ఉపకరణాలు సైతం కాలిపోయాయి.
అధిక ఓల్టేజీ కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే మహిళ మృతికి కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు.. మంగళమడక గ్రామానికి వెళ్లి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఇవీచూడండి: మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌కు ప్రమాదం..