ETV Bharat / crime

సంగారెడ్డి జిల్లాలో విషాదం.. ఏడాది పాపతో బావిలోకి దూకి మహిళ ఆత్మహత్య - ఏడాది పాపతో బావిలోకి దూకి మహిళ ఆత్మహత్య

A woman committed suicide: కుటుంబ కలహాలతో వివాహిత నిన్న రాత్రి ఏడాది బిడ్డతో కలిసి మహిళ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు అంబిక(23), నక్షత్ర (ఏడాది) గా పోలీసులు గుర్తించారు. భర్త, అత్తమామల వేధింపులతోనే తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.

A woman committed suicide in Sangareddy district

author img

By

Published : Oct 22, 2022, 11:39 AM IST

A woman committed suicide: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వివాహిత తన ఏడాది బిడ్డతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ గ్రామానికి చెందిన మహేశ్‌గౌడ్‌-అంబిక దంపతులకు ఏడాది బిడ్డ నక్షత్ర ఉంది. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలోనే అంబిక తన బిడ్డతో కలిసి నిన్న బావిలో దూకింది.

సమాచారం అందుకున్న చిరాగ్‌పల్లి పోలీసులు... అర్ధరాత్రి వరకు బావిలో గాలించగా, తల్లీబిడ్డ మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోలీసులు జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్త, అత్తమామల వేధింపులతోనే తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని అంబిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. పెళ్లి సమయంలో ఐదు లక్షల కట్నం, ఐదు తులాల బంగారు ఆభరణాలు ఇచ్చామని అయినా గత మూడేళ్లుగా ఆమె భర్త వేధించేవాడని కంటతడి పెడుతూ చెప్పారు. అంబిక మృతికి కారణమైన మహేశ్​గౌడ్ అతని తల్లిదండ్రులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.