మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పరిధి పద్మనగర్ ఫేస్ 2లో విషాదం జరిగింది. అనారోగ్య సమస్యలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్వాతి అనే మహిళ ఇటీవలే సింగపూర్ నుంచి తల్లి వద్దకు వచ్చింది. అప్పటి నుంచి పద్మానగర్లోని తల్లి వద్దనే ఉంటోంది.
అనారోగ్య సమస్యల కారణంగా పలుమార్లు తాను చనిపోతానని బాధపడేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిందని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: వైద్య విద్యార్థి ఆత్మహత్య.. ప్రేమ విఫలమే కారణం!