Kukatpally Accident : హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్ నంబర్ 1 వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడిని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన తర్వాత అతన్ని ఆ టిప్పర్.. దాదాపు 20 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. టిప్పర్ డ్రైవర్ తప్పించుకునేందుకే వాహనాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లాడని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ప్రమాదానికి కారణమైన వాహనదారుడు ఆపకుండా వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు. మృతుడు జగన్ మోహన్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... విచారణ చేపట్టారు.
![Kukatpally Accident, software engineer died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14137024_software.jpg)
ఇదీ చదవండి: LB Nagar Car Accident : కారు బీభత్సం.. రూ.13,350 పెండింగ్ చలాన్లు!