cbi raids: దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజినీర్ సురేశ్ లంచం తీసుకుంటూ నిన్న సీబీఐకి పట్టుబడ్డారు. ఉప్పల్- జమ్మికుంట మధ్య రైల్వే పైవంతెన కాంట్రాక్ట్ కోసం ఓవ్యక్తి నుంచి రూ.5లక్షలు తీసుకుంటుండగా.. నాచారంలోని అతడి నివాసంలో సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండడ్‌గా పట్టుకున్నారు. నిన్న సాయంత్రం నుంచి అతని ఇంటిలో అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సురేశ్‌ను అరెస్ట్ చేసి సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. అతనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: Inter students suicide: రాష్ట్రంలో మరో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య