ETV Bharat / crime

పెళ్లింట దారుణం.. బామ్మర్దిని నరికి చంపిన బావ - అంబారిపేటలో హత్య

అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంట్లో జరగాల్సిన శుభకార్యం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ ఇంతలోనే దారుణం జరిగింది. మాటు వేసిన బావ తన సొంత బామ్మర్దినే మట్టుబెట్టాడు. గొడ్డలితో దాడి చేసి అంతమొందించాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లా అంబారిపేటలో చోటు చేసుకుంది.

Murder
జగిత్యాల జిల్లా అంబారిపేటలో దారుణం
author img

By

Published : Feb 3, 2022, 8:50 AM IST

Updated : Feb 3, 2022, 2:05 PM IST

జగిత్యాల జిల్లా అంబారిపేటలో దారుణం చోటు చేసుకుంది. తెల్లారితే పెళ్లి వేడుకలు జరగాల్సిన ఇంట్లో మరణ మృదంగం మోగింది. శుభకార్యం పనులు జరుగుతుండగానే బామ్మర్దిపై బావ గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రగాయాలైన శంకర్‌ను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అడ్డు వచ్చిన అత్తపై కూడా దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

భూమిని విక్రయించాడని..

జిల్లాలోని పొలాస గ్రామానికి చెందిన పౌలస్తేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్‌ వీర్ల శంకర్‌(48).. ఆయన చెల్లెలు జమునను అంబారిపేట వాసి ఆది వెంకటేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమార్తెలు ప్రవళిక, పూజిత. కొన్నాళ్లకు వెంకటేష్‌ మరో వివాహం చేసుకుని గ్రామంలోనే అద్దె ఇంట్లో ఉంటున్నారు. వెంకటేష్‌ వ్యవసాయ భూమి మొదటి భార్య పేరిట ఉంది. అందులో కొంత భూమిని ఇటీవల వీర్ల శంకర్‌ విక్రయించాడు. ఆ సొమ్ముతో వెంకటేష్‌ పెద్ద కుమార్తె పెళ్లి జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తన భూమిని విక్రయించాడన్న కోపంతో బావమరిది శంకర్‌పై వెంకటేష్‌ కక్ష పెంచుకున్నాడు. గురువారం పెద్ద కుమార్తె ప్రవళిక వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పందిరికి అవసరమైన దుంపిడిగుంజను కొట్టితెస్తుండగా వెంకటేష్‌ వచ్చి శంకర్‌తో గొడవకు దిగాడు. కోపం పట్టలేక గొడ్డలితో దాడి జరపగా తీవ్రంగా గాయపడిన శంకర్‌ ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందారు. సంఘటనలో అడ్డువెళ్లిన శంకర్‌ తల్లి గంగుకు గాయాలయ్యాయి. పట్టణ సీఐ కిషోర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Feb 3, 2022, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.