ETV Bharat / crime

లోన్​యాప్​ ఆగడాలకు ప్రైవేట్​ ఉద్యోగి బలి.. సూసైడ్​ నోట్ చూస్తే..!​ - Lonapp crashes

లోన్​యాప్ నిర్వాహకులు​ రోజురోజుకూ పేట్రేగిపోతున్నారు. ఎలాంటి హమీ పత్రాలు లేకుండా రుణాలిస్తూ.. ఆ తర్వాత రుణం తీసుకున్న వారిని రాబందుల్లా పీక్కుతింటున్నారు. అసభ్య పదజాలంతో.. ఫొటోలు మార్ఫింగ్​ చేసి వారిని వేధిస్తున్నారు. ఇలాంటి ఆగడాలకు విసిగివేసారి.. నగరంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

young man died
young man died
author img

By

Published : Sep 27, 2022, 1:50 PM IST

లోన్​ యాప్​ నిర్వాహకుల వేధింపులు తాళలేక నగరంలో మరో యువకుడు బలయ్యాడు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి రాజీవ్​గాంధీ నగర్​లో నివాసముండే రాజేశ్​ సోమవారం ఉరి వేసుకొని మృతి చెందాడు. భార్య, మూడు సంవత్సరాల కూతురుతో కలిసి నివాసం ఉంటున్న రాజేశ్​​ బిగ్ బాస్కెట్​లో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య స్వగ్రామం విజయవాడ వెళ్లగా.. ఇంటికి కొరియర్ రావడంతో భార్య.. రాజేశ్​​కు ఫోన్ చేసింది.

భర్త ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వాచ్​మెన్​కు ఫోన్ చేయగా.. ఇంట్లో గడియ పెట్టి ఉండటంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్​కి ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో వెంటనే బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తిం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

కన్నీరు తెప్పిస్తున్న సూసైడ్​ నోట్​: "అమ్ము ఐ యామ్​ సోరీ. ఆన్​లైన్​లో లోన్​ తీసుకొని తప్పు చేశా. ఇప్పుడు వాళ్లు నా ఫొటోలు మార్ఫింగ్​ చేసి అసభ్యకరంగా వేధిస్తున్నారు. ఇక నేను బతకలేను. లోన్ ​యాప్​లపై ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్​ చర్యలు తీసుకోవాలి. నాలా మరెవరూ బలికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి''. అంటూ బోర్డుపై రాసిన సూసైడ్​ నోట్​ అందరికి కన్నీరు తెప్పుస్తోంది.

కన్నీరు తెప్పిస్తున్న సూసైడ్​ నోట్
కన్నీరు తెప్పిస్తున్న సూసైడ్​ నోట్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.