ETV Bharat / crime

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. రూ.16 లక్షలు మోసం - a person cheated friend's wife

స్నేహితుడే కదా అని ఇంట్లోకి రానిస్తే.. పరిధి దాటి వాళ్ల కాపురంలోకి వచ్చాడు.. ఓ ఉత్తమ ఫ్రెండు. నమ్మినందుకు అతని సంసారంలో కలతలు రేపాడు. ప్రేమ పేరుతో స్నేహితుడి భార్యపై కన్నేయడమే కాకుండా.. రూ.16 లక్షలు కొల్లగొట్టాడు. మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్​లో ఈ ఘటన చోటుచేసుకుంది.

a person cheated rupees sixteen lakh at friend's wife
స్నేహితుడి భార్య వద్ద చీటింగ్​
author img

By

Published : Nov 8, 2021, 8:31 PM IST

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని స్నేహం అనే పదానికే మచ్చతెచ్చి పెట్టాడు ఓ ఫ్రెండు. నమ్మి ఇంట్లోకి రానిచ్చినందుకు నయవంచన చేశాడు. ఫ్రెండు భార్యపై కన్నేసి ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్​కు చెందిన ప్రశాంత్​.. తన స్నేహితుడి భార్యపై కన్నేశాడు. 'నిన్ను ప్రేమిస్తున్నానని.. నన్ను ప్రేమించకపోతే చనిపోతాను' అని బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరింపులకు గురిచేశాడు.

తనకు సినీఫీల్డ్​లో పరిచయాలు ఉన్నారని బాధితురాలిని నమ్మించాడు. ఈ క్రమంలో బాధితురాలు ఇటీవల ప్లాట్​ అమ్మింది. విషయం తెలిసిన ప్రశాంత్​ బాధితురాలితో సన్నిహితంగా ఉంటూ.. మాయమాటలు చెప్పి స్థలం అమ్మగా వచ్చిన డబ్బు రూ.16 లక్షలు తీసుకున్నాడు. అధిక వడ్డీ ఇస్తానని చెప్పాడు. తీసుకున్న డబ్బు ఇవ్వకపోయే సరికి బాధితురాలు ప్రశాంత్​ను నిలదీసింది. డబ్బు ఇవ్వకపోగా ఆమెను చంపుతానని బెదిరించాడు. అతని వేధింపులు భరించలేక మహిళ.. బషీర్​పేట్​ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి: Liquor stores in telangana: డిసెంబర్‌ నుంచి అమలులోకి నూతన మద్యం విధానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.