Suicide attempt: ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం స్థానికంగా కలకలం రేపింది. జైనథ్ మండలం లక్ష్మీపూర్కి చెందిన ఆడేల్లు అనే వ్యక్తి.. ప్రజావాణిలో సమస్యను చెప్పుకునేందుకు వచ్చారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ కలిసిన ఆయన.. సమస్య చెప్పకుండానే డీజిల్ పోసుకుని అగ్గిపుల్ల గీసే యత్నం చేశాడు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయన్ను బయటకు తీసుకొచ్చి పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం మట్లాడిన బాధితుడు తనపై సామాజిక మధ్యమాల్లో ఎమ్మెల్యే అనుచరులు కించపర్చేలా ప్రచారం చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలి కోరాడు. తనపై కొందరు దాడి చేసేందుకు చూస్తున్నారని ఆరోపించాడు. అధికారులే తనకు న్యాయం చేయాలని కోరాడు.
"ఎమ్మెల్యే అతని అనుచరులు నన్ను వేధిస్తున్నారు. నాపై సోషల్ మీడియాలో అసత్యంగా ప్రచారం చేస్తున్నారు. నేను దళితుడినని నన్ను బెదిరిస్తున్నారు. నాపై దాడులు చేసేందుకు ఎమ్మెల్యే అనుచరులు చూస్తున్నారు. మీరే ఎలైనా నాకు న్యాయం చేయాలి". -ఆడేల్లు, బాధితుడు
ఇవీ చదవండి: