ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మైనర్ బాలిక అదృశ్యమైన (Missing) ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో చోటుచేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం వజ్రకండికి చెందిన సంజయ్ కుమార్ కుటుంబంతో ఇస్నాపూర్ గ్రామానికి వచ్చి తాపీ మేస్త్రి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన కూతురు ఈనెల 14 మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లింది. సాయంత్రమైనా... ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల తెలిసిన చోట తండ్రి సంజయ్ కుమార్ వెతికాడు.
ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో పటాన్చెరు పోలీస్ స్టేషన్లో తండ్రి సంజయ్ కుమార్ ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: Police Stations: కార్పొరేట్ కార్యాలయం కాదు పోలీస్ స్టేషన్