ఆన్లైన్లో పేకాట, క్రికెట్ బెట్టింగ్లో నష్టపోయిన ఓ వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పడ్తన్పల్లిలో జరిగింది.
గ్రామానికి చెందిన పోశెట్టి... ఆన్లైన్ బెట్టింగ్లో ఆర్థికంగా నష్టపోయాడు. గత పది రోజులుగా దిగాలుగా ఉండేవాడని... ఈ క్రమంలో బుధవారం ఇంటికి సమీపంలో క్రిమిసంహారక ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: మహిళను వేధించిన కేసులో ఓ వ్యక్తి అరెస్టు