ETV Bharat / crime

భార్య విడిచి వెళ్లిందన్న కోపంతో కరెంట్ పోల్ ఎక్కాడు.. ఆతర్వాత ఏమైందంటే - Bitragunta Latest News

Suicide Attempt : ఏపీ కేరళ నుంచి ఝార్ఖండ్ వెళ్లాల్సిన వ్యక్తి బిట్రగుంట రైల్వే స్టేషన్​లో దిగాడు. తన భార్య తనను వదిలి వెళ్లిపోయిందంటూ కొద్దిసేపు హంగామా చేశాడు. భార్య ఇక రాదేమోనని మనస్థాపానికి గురైన అతను.. రైల్వే కరెంట్​ స్తంభం ఎక్కి విద్యుత్​ తీగలను పట్టుకొని అత్మహత్యకు యత్నించాడు.

కేరళ
కేరళ
author img

By

Published : Sep 14, 2022, 6:20 PM IST

Suicide Attempt: ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వేస్టేషన్​లో ఓ వ్యక్తి హల్​చల్​ చేశాడు. విద్యుత్​ తీగలను పట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు. కండీర్ (34) కేరళ నుంచి ఝార్ఖండ్​కు వెళ్తున్నాడు. కానీ తను వెళ్లాల్సిన గమ్యం రాకముందే బిట్రగుంట రైల్వే స్టేషన్​లో దిగాడు. ఆత్మహత్య చేసుకుంటానని కొద్దిసేపు హంగామా చేశాడు. ఎంతమంది ఆపినా వినకుండా విద్యుత్​ స్తంభం ఎక్కి తీగలను పట్టుకున్నాడు.

వెంటనే కండీర్ విద్యుద్ఘాతానికి గురై కింద పడిపోయాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని 108 వాహనంలో కావలి ఆస్పత్రికి తరలించారు. కండీర్​ది ఝార్ఖండ్ రాష్ట్రంగా రైల్వే పోలీసులు గుర్తించారు. భార్యతో గొడవపడటంతో ఆమె అతడిని విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మనస్థాపంతోనే అతను ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఇవీ చదవండి: 'కరోనా సమయంలో నా ఆత్మవిశ్వాసం దెబ్బతింది.. అందుకే..'

మంటల్లో నుంచి బయటపడలేక పోతున్నాం.. చివరిసారిగా కుటుంబంతో సికింద్రాబాద్ ఘటన మృతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.