ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఆకులవారిఘణపురం గ్రామానికి చెందిన సాబీర్ కన్నాయిగూడెం మండలంలోని ఓ సంస్థలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో గత 6 నెలలుగా యాజమాన్యం వేతనాలు ఇవ్వడం లేదు. ఫలితంగా తరచూ ఇంట్లో భార్యతో గొడవలు జరుగున్నాయి. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన సాబీర్.. మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తు ఆ సమయంలో కరెంట్ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది.
సాబీర్ సుమారు గంట పాటు స్తంభంపై హల్చల్ చేశాడు. స్థానికులు ఎంతనచ్చజెప్పినా వినలేదు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేశారు. అతడికి నచ్చజెప్పి కిందకు దింపారు. కౌన్సెలింగ్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.