హైదరాబాద్‌లో దిల్సుఖ్నగర్ మెట్రోస్టేషన్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్యకు యత్నించాడు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధితుడు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడకు చెందిన భీమా(45)గా గుర్తించారు.
క్షతగాత్రున్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి వివరాల కోసం పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల ఆధారంగా ప్రమాదవశాత్తు పడ్డాడా లేదా ఆత్మహత్య చేసుకునేందుకా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: Husband killed his wife: భార్యను చంపేశాడు.. సహజ మరణంగా చిత్రీకరించాడు!