సికింద్రాబాద్లోని జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో రాజు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రి 9 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రాజు అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. మృతదేహం వద్ద బోరున విలపించారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని జవహర్ నగర్ పోలీసులు తెలిపారు. సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు. పాత కక్షలా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: వేధింపులు భరించలేక వీఆర్ఏ ఆత్మహత్య