ఇంటి ముందు నిలిపి ఉన్న వాహనాలను ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. ఈ ఘటన కూకట్ పల్లి పరిధిలోని వివేకానంద నగర్లో చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే వ్యక్తి అర్ధరాత్రి వేళ కాలనీలో తిరుగుతూ.. ఇంటి ముందు నిలిపి ఉన్న వాహనాలను ధ్వంసం చేస్తున్నట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
గత నాలుగైదు నెలల నుంచి పదుల సంఖ్యలో కారు అద్దాలు పగలగొట్టి భయాందోళనకు గురి చేస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: సిరిసిల్లలో త్వరలో అందుబాటులోకి రానున్న అర్బన్ పార్క్