ETV Bharat / crime

పోలీసుల నుంచే తప్పించుకోబోయి.. ఎస్సైనే ఢీ కొట్టాడు - ఎస్సైని ఢీ కొట్టిన వ్యక్తి

డ్రంక్​ అండ్​ డ్రైవ్​ టెస్ట్​ నుంచి తప్పించుకోబోయి కేపీహెచ్​బీ ఎస్సైనే ఢీ కొట్టాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో ఎస్సై కాలుకు తీవ్రంగా గాయమైంది. ఆసుపత్రికి తరలించి, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐ తెలిపారు.

a man rushed kphb sub inspector in escape from drunk and drive tests
పోలీసుల నుంచే తప్పించుకోబోయి.. ఎస్సైనే ఢీ కొట్టాడు
author img

By

Published : Feb 23, 2021, 12:13 PM IST

డ్రంక్​ అండ్​ డ్రైవ్ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిని మద్యం మత్తులో ఓ వ్యక్తి ఢీ కొట్టిన ఘటన... కేపీహెచ్​బీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కేపీహెచ్​బీ ఎస్సై రాజేశ్వర్​ జేఎన్​టీయూ రోడ్డులో రైతు బజార్​ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నాడు. రాత్రి పన్నెండున్నరకు మాదాపూర్​ నుంచి సాయికుమార్​ అనే వ్యక్తి రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​పై కేపీహెచ్​బీ వైపు వస్తూ... పోలీసులను చూసి వెనక్కి తిప్పాడు.

పోలీసుల నుంచే తప్పించుకోబోయి.. ఎస్సైనే ఢీ కొట్టాడు

అప్పటికే అక్కడ కూడా పోలీసులు ఉండటం వల్ల... మళ్లీ వెనక్కి తిప్పి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఎస్సైని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఎస్సై కాలుకు తీవ్ర గాయమైంది. నిందితుడికి డ్రంక్​ అండ్​ డ్రైవ్​ టెస్ట్​ నిర్వహించగా... 175 ఎంజీ రికార్డైంది. చికిత్స కోసం ఎస్సైని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు కేపీహెచ్​బీ సీఐ తెలిపారు.

ఇదీ చూడండి: కేసు ఓడిపోయాడని న్యాయవాది‌పై హత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.