హైదరాబాద్ బాలానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఫుట్‌పాత్‌పై పడుకుంటూ రోజువారీ కూలీ పని చేసుకునే ఇద్దరు కూలీలు.. రూ.400 కోసం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కాశీరాం, శ్రీనివాస్ అనే ఇద్దరు కూలీల మధ్య తమకు ఆదాయంగా వచ్చిన రూ.400 కోసం వాగ్వాదం జరిగింది. ఈ గొడవ కాస్తా పెద్దది కావడంతో.. శ్రీనివాస్‌ను కాశీరాం కర్రతో కొట్టాడు. అనంతరం అటుగా వెళ్తున్న లారీ కిందకి అతడిని తోసేశాడు.
దీంతో శ్రీనివాస్ తలకి తీవ్ర గాయమై.. అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
తిమింగలం వాంతితో దందా.. 25కేజీలు సీజ్ చేసిన పోలీసులు.. విలువ రూ.25కోట్లు!