ETV Bharat / crime

అర్ధరాత్రి ఇంట్లోకి ఎంటరై.. ఇటుకతో చంపిన దుండగుడు​ - medchal crimes

మేడ్చల్ జిల్లా నేరెడ్​మెట్​లో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డ గుర్తు తెలియని దుండగుడు.. అతడిని చంపి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

murder in Nered Met
murder in Nered Met
author img

By

Published : May 17, 2021, 1:07 PM IST

మేడ్చల్ జిల్లా నేరెడ్​మెట్​లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శ్యామ్ సుందర్ అనే వ్యక్తి ఇంట్లోకి.. అర్ధరాత్రి ఓ గుర్తు తెలియని దుండగుడు చొరబడ్డాడు. మద్యం మత్తులో ఉన్న అతడిని.. ఇటుకతో కొట్టి హత్య చేశాడు. అది గమనించిన శ్యామ్ సుందర్ తల్లి.. భయంతో కేకలు వేయడంతో దుండగుడు అక్కడినుంచి పరారయ్యాడు.

కేసు నమోదు చేసుకున్నపోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. శ్యామ్ సుందర్​ హత్యకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి కారణమై ఉంటాడని వారు అనుమానిస్తున్నారు. పాత కక్షలే కారణమా లేక వేరే ఏదైనా వ్యవహారంలో తేడా రావడం వల్ల అది హత్యకు దారితీసిందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: కరోనా కాలంలో మహిళలపై పెరిగిన వేధింపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.