సూక్ష్మ రుణాల వ్యాపారం పేరుతో మోసగించిన వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని రాజ్గంజ్పూర్లో దీపక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు నగరానికి తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. 2019లో ఓ సూక్ష్మ రుణ సంస్థ స్థాపించేందుకు నాబార్డు నుంచి రూ.5 కోట్ల రుణం పొందినట్లు పోలీసులు వెల్లడించారు.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో సూక్ష్మ రుణ వ్యాపారం నిర్వహిస్తానంటూ నాబార్డు నుంచి రుణం పొందాడు. రెండేళ్ల వ్యవధిలో రుణం చెల్లిస్తానని చెప్పిన దీపక్ రూ.2 కోట్లు బకాయి పడడంతో నాబార్డు ప్రాంతీయ కార్యాలయ ప్రతినిధి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒడిశా వెళ్లి నిందితున్ని అరెస్ట్ చేశారు.
తమిళనాడు, కర్ణాటకలోనూ కేసులు
ఇప్పటికే పలు బ్యాంకు, రుణ సంస్థల నుంచి దీపక్ రూ.200 కోట్లకు పైగా అప్పులు తీసుకుని మోసం చేసినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోనూ అతనిపై పలు కేసులు నమోదైనట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు
ఇదీ చూడండి: Drugs seized: గుట్టుగా మత్తు పదార్థాల విక్రయం.. నిందితుల అరెస్ట్