అమెరికాలో సూర్యాపేట జిల్లా కోదాడ వాసి మృతిచెందారు. బోటింగ్ చేస్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో సిరిపురపు రవికుమార్ ప్రాణాలు కోల్పోయారు. వారాంతపు సెలవు కావడంతో రవి స్నేహితులతో బోటింగ్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
రవికుమార్ అమెరికాలోని ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో మూడేళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఈ ప్రమాదం పట్ల రవి స్నేహితులు అతడి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ కొడుకు మృతదేహాన్ని దేశానికి రప్పించాలని మృతుడి తండ్రి వేడుకున్నాడు.
ఇదీ చదవండి: SCHOOLS OPEN: జులై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని నిర్ణయం