ETV Bharat / crime

రండిబాబూ రండి అన్నాడు.. వచ్చి బుట్టలో పడ్డాక అన్నీ అమ్ముకుని పరారయ్యాడు.. - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

JOB FRAUD: ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. మంచి అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని మాయమాటలు చెప్పాడు. నిజమని నమ్మిన కొంతమంది అతడికి డబ్బులు ఇచ్చారు. ఐదేళ్లు దాటినా ఉద్యోగం రాకపోవడంతో నిలదీశారు. అప్పుడూ.. మాటలతో నమ్మించి బురిడి కొట్టించాడు. ఉద్యోగం రాకుంటే నా ఇల్లు అమ్మి డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. కట్​ చేస్తే.. ఎవరికీ తెలియకుండా ఇల్లు అమ్మి పరారయ్యాడు. ఈ ఘటన ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.

job FRAUD
job FRAUD
author img

By

Published : May 10, 2022, 8:24 PM IST

JOB FRAUD: రైల్వేలో టీసీ, క్లర్కు తదితర ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన ఘటన ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఆలస్యంగా వెలుగు చూసింది. సుమారు 10 మంది నుంచి 15 లక్షల రూపాయలు తీసుకొని నిందితుడు పారిపోవడంతో బాధితులు డీఎస్పీని ఆశ్రయించారు. ఆధారాలు, వీడియోలు అన్ని సమర్పించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన డీఎస్పీ చట్టపరంగా ముందుకు వెళ్తామని తెలిపారు.

ఇదీ జరిగింది : ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని నాగలకట్టకు చెందిన జోయల్ దాస్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. 2016 సంవత్సరం నుంచి ఈ తరహా మోసం కొనసాగుతోంది. ఇది మంచి అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని మాయమాటలు చెప్పి నమ్మించి.. ఒక్కొక్కరి వద్ద మూడు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. ఐదేళ్లు దాటినా ఉద్యోగం రాకపోవడంతో బాధితులు అతడిని నిలదీశారు. అప్పుడు కూడా మాటలతో నమ్మించి బురిడి కొట్టించాడు. మీకు ఉద్యోగం రాకుంటే నా ఇల్లు అమ్మి మీ డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. దాంతో బాధితులు కొన్ని రోజులు ఆగారు. ఇదే మంచి సమయం అనుకొని ఎవరికీ తెలియకుండా ఇల్లు అమ్మి పరారయ్యాడు. అనుమానం వచ్చిన బాధితులు మోసపోయామని గ్రహించి డీఎస్పీ నాగరాజును కలిశారు.

ఇవీ చదవండి: 'ప్రశ్నాపత్నం లీక్ కేసులోనే నారాయణ అరెస్టు.. అడ్మిషన్ల కోసమే మాల్ ప్రాక్టీస్‌..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.