ETV Bharat / crime

ఉద్యోగం కోసం డబ్బులిచ్చి మోసపోయానని యువకుడి ఆత్మహత్య - Young man suicide latest news

Young Man Suicide in Ramagundam రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగం కోసం మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనలాంటి బాధితులకు న్యాయం జరగాలంటూ సామాజిక మాధ్యమాల్లో హరీశ్ అనే వ్యక్తి వీడియో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్​గా మారడంతో పోలీసులు అతని కోసం గాలించగా ఈ రోజు హరీశ్‌ మృతదేహం లభ్యమైంది.

Young Man Suicide in Ramagundam
Young Man Suicide in Ramagundam
author img

By

Published : Aug 27, 2022, 12:13 PM IST

Young Man Suicide in Ramagundam: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగం కోసం మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి మోసపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హరీష్ ఆర్​ఎఫ్​సీఎల్​లో​ మాజీ ఉద్యోగి. కర్మాగారంలో ఉద్యోగం కోసం మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి మోసపోయాడు. ఈ క్రమంలో ఆత్మహత్యే శరణ్యమని భావించాడు. అందులో భాగంగా చనిపోయేముందు వీడియో తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.

అది కాస్త వైరల్​గా మారడంతో పోలీసులు అతడి కోసం గాలించారు. ఈ రోజు కమాన్పూర్ మండల కేంద్రంలోని బావిలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాగా మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. గత నెల రోజుల నుంచి రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాల విషయంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాత్ర ఉన్నట్లు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేప్టటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.