ETV Bharat / crime

కత్తితో భార్యను నాలుగుసార్లు పొడిచి.. కుమార్తె గొంతు కోసి.. - man attack on wife and daughter

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా.. భార్య, కూతురిపై కత్తితో విచక్షణారహింతంగా దాడి చేశాడో ప్రబుద్ధుడు.

a man attacked on his wife and daughter with knife in illandhu

author img

By

Published : May 25, 2022, 11:52 AM IST

కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి.. తన భార్యతో పాటు కూతురిపై కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు పట్టణంలోని బస్తీలో ఉంటున్న సుల్తాన్​.. జేసీబీ డ్రైవర్​గా పనిచేస్తుంటాడు. సుల్తాన్, జరీనా​ దంపతులకు 11 ఏళ్ల కూతురు ఉంది. గతంలో సుల్తాన్​ గల్ఫ్​ దేశానికి వెళ్లొచ్చాడు. అప్పటి నుంచి జేసీబీ డ్రైవర్​గా పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో.. సుల్తాన్​, జరీనా దంపతులకు తరచూ గొడవలు అవుతుండేవి. ఎప్పటిలాగే ఈరోజు కూడా భార్యాభర్తల మధ్య గొడవ కాగా.. సుల్తాన్​ కోపొద్రిక్తుడయ్యాడు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో భార్య జరీనాను కత్తితో నాలుగుసార్లు పొడిచాడు. అనతంరం.. కూతురి గొంతు కోశాడు. గమనించిన ఇరుగుపొరుగువాళ్లు.. రక్తసిక్తమైన ఇద్దరినీ ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.