HALCHAL IN JAGTIAL: జగిత్యాలలో మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. కొత్త బస్టాండ్ సమీపంలోని నటరాజ్ టాకీస్ వద్ద ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై నుంచి అదుపుతప్పి కింద పడిపోయాడు. అక్కడే ఉన్న పెట్రోలింగ్ సిబ్బంది అతడిని పైకి లేపారు. ఎక్కడి నుంచి వస్తున్నావని ప్రశ్నించారు.
Jagtial police: మత్తులో ఉన్న అతను మీరేవరంటూ ఎదురు ప్రశ్నించాడు. పోలీసులమని సమాధానమివ్వగా మీ ఐడీ కార్డు చూపించాలన్నాడు. కానిస్టేబుళ్లు వెంటనే ఎస్సైకి సమాచారం ఇచ్చారు. అతడు కోరిన విధంగా ఐడీ కార్డు చూపించాలని ఎస్సై వారికి సూచించారు. అనంతరం బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా మద్యం తాగినట్లు తేలింది. అతనికి ఏకంగా 164 పాయింట్ల వరకు రీడింగ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. వాహనం సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
ఇదీ చూడండి:
Luxury Car Thief: చుక్కలు చూపిస్తున్న కరడుగట్టిన లగ్జరీ కార్ల దొంగ