Crypto Currency Fraud: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొత్తలింగాలలో క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ల పేరిట జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది. కామేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి ... పది గ్రూపుల ద్వారా ఏడాదిన్నర నుంచి క్రిప్టో కరెన్సీ పేరిట పలువురి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు. మొదట ఆ వ్యక్తి గ్రూపులు ఏర్పాటు చేశాడు.
లక్ష డెబ్బై వేల రూపాయలు పెట్టుబడి పెడితే.. మరుసటి రోజు ముప్పై వేల రూపాయల విలువ గల బిట్ కాయిన్స్ నగదు జమ అవుతాయని వారికి చెప్పేవాడు. అలా పెట్టుబడి పెట్టిన వారికి చెప్పిన విధంగా బిట్ కాయిన్స్ పంపేవాడు. తరువాత 24 వారాల పాటు రూ.పన్నెండు వేల చొప్పున జమ చేయడం జరుగుతుందని ఆశచూపాడు. 20,000, 60,000, 1,20,000 రూపాయల చొప్పున ప్యాకేజీలు ప్రకటించాడు.
ఇంకేముంది ఈ మోసగాడి మాటలకు ఆకర్షితులై ఖమ్మం, కామేపల్లి, కూసుమంచి, వైరా, ఏన్కూర్, మధిర ప్రాంతాల ప్రజలు పెట్టుబడి పెట్టారు. చివరికి తాము మోసపోయామని గ్రహించిన బాధితులు ఆందోళనకు దిగారు. మోసపోయిన వారంతా ఇవాళ పురుగు మందు డబ్బాలు, పెట్రోల్ సీసాలతో మోసం చేసిన వ్యక్తి ఇంటిముందు ఆందోళనకు దిగారు. తమ డబ్బు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బిట్ కాయిన్ల పేరిట వీరందరి దగ్గరి నుంచి సుమారు దాదాపు రూ.70 లక్షల వరకు మోసం చేసినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: