కరోనా బాధితుల అవసరాన్ని ఆసరాగా మార్చుకుని ఇంజక్షన్లతో వ్యాపారం సాగిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కాకుమని దిలీప్(29) వనస్థలిపురంలోని ప్రజ్ఞ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. సరూర్‌నగర్ వెంకటేశ్వరకాలనీకి చెందిన వల్లమల్ల మధు.. కొత్తపేటలోని సాయిసంజీవని ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఇద్దరు ప్రదీప్ అనే వ్యక్తితో కలిసి కొద్ది రోజులుగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల వ్యాపారం చేస్తున్నారు.
చికిత్స పొందుతూ మృతి చెందిన కరోనా రోగులకు సంబంధించిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను వారి కుటుంబసభ్యులకు అందజేయకుండా.. వాటిని బయట ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఉప్పల్‌లోని మెట్రోస్టేషన్ వద్ద ఇంజక్షన్లు విక్రయిస్తుండగా.. మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో 77 వేలు దాటిన కరోనా క్రియాశీల కేసులు