రోడ్డుపై ఖరీదైన బండి కనిపించిందా.. నిమిషాల్లో మాయం చేయడమే బాలరాజు, అతని ముఠా(Bike thieves in Hyderabad) పని. ఇందులో ఆరుగురిని అరెస్టుచేశారు బాలానగర్ సీసీఎస్ పోలీసులు. శుక్రవారం బాలానగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ పద్మజ వివరాలను వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ తుమ్మన్‌పేట్‌కు చెందిన చింతల బాలరాజు(23) ఐడీఎ బొల్లారంలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కొందరితో కలిసి కొన్నేళ్లుగా బైక్‌ల చోరీలు(Bike thieves in Hyderabad) మొదలుపెట్టాడు. కొన్నిరోజుల తర్వాత ఈ బండ్లను చాలా తక్కువ ధరలకు విక్రయిస్తారు.
బుల్లెట్ మాయం..
గత నెల 28న దుండిగల్ బౌరంపేటకు చెందిన ఓ వ్యక్తి తన ఇంటి ముందు పెట్టిన బుల్లెట్(Bike thieves in Hyderabad) మాయమైంది. ఫిర్యాదుతో దుండిగల్ పోలీసులు బాలానగర్ సీసీఎస్ పోలీసుల సహకారంతో దర్యాప్తు ప్రారంభించారు. ఓ వేగు ఇచ్చిన సమాచారంతో చింతల బాలరాజును అదుపులోకి తీసుకొని విచారించారు.
ముఠాగా ఏర్పడి..
వనపర్తి జిల్లా రాజంపేటకు చెందిన బీటెక్ విద్యార్థి రత స్వామి(19), మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన ఈర్వ విజయ్‌కృష్ణ(24), కీసరవాసి బర్దసారి సుభాష్, భరత్(21), బండ్లగూడ రాజీవ్ గృహకల్ప వాసి షేక్ మహమ్మద్ అబ్దుల్ అలమ్(20), ఐడీఎ బొల్లారం వాసి మహమ్మద్ సోహిల్(19).. వీరంతా కలిసి దొంగతనాలకు(Bike thieves in Hyderabad) పాల్పడేవారు. చందానగర్ వాసి కల్లమ్ల దీపక్, మౌలాలి వాసి మహమ్మద్ అన్వర్(20)లు ఆ వాహనాలను విక్రయించేవారు. ప్రధాన నేరస్థుడు బాలరాజుపై వివిధ ఠాణాల్లో 15 కేసులు నమోదయ్యాయి. పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు డీసీపీ వెల్లడించారు. దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎం.పవన్, ఎస్‌ఐలు జి.పోచయ్య, విజయ్‌భాస్కర్‌రెడ్డి, సిబ్బందితో పాటు దుండిగల్ ఇన్‌స్పెక్టర్‌ను ఆమె అభినందించారు.