జనగామ జిల్లా నెల్లుట్ల వద్ద ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. బస్సు ఛత్తీస్‌గఢ్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద సమయంలో 26 మంది ప్రయాణికులు ఉండగా... డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నట్లు బస్సు సిబ్బంది తెలిపారు. మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా కాలిపోయింది.