కొన్ని రోజులుగా బిడ్డ నలతగా ఉంటోంది. ఎంత అడిగినా ఏమీ చెప్పడం లేదు. రోజురోజుకు క్షీణిస్తున్న కుమార్తె ఆరోగ్యంపై తల్లికి రకరకాల ఆలోచనలు. సమయానికి భర్త కూడా ఇంట్లో లేడు. వాంతులు చేసుకుంటున్నా 16 ఏళ్ల కుమార్తెను తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. అజీర్తి వల్ల వాంతులు అయ్యాయనే అనుకుంది కానీ... వైద్యులు చెప్పిన మాట విని కాళ్లకింద భూమి కంపించింది. కోపోద్రిక్తురాలై బిడ్డను నిలదీసింది. కుమార్తె చెప్పిన సమాధానం విని మ్రానులా ఉండిపోయింది. ఎదుగొచ్చిన బిడ్డ 16 ఏళ్లలో గర్భవతి అతి తెలిసి.. దానికి కారణం తండ్రే అని విన్నప్పుడు కన్నతల్లి హృదయం కకావికలం అయింది. కంటి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. మృగవాంఛతో కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిసి.. తన దుఖాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియక నరకయాతన అనుభవించింది. తాళిబొట్టుకు... కన్నపేగుకు జరిగిన సంఘర్షణలో కన్నపేగు గెలిచింది. బిడ్డ జీవితాన్ని నాశనం చేసిన భర్తను కటకటాలకు పంపింది. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో జరిగింది.
బతుకుదెరువుకు వచ్చి
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా శిల్పలంక గ్రామానికి చెందిన వెంకటరమణకు భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. బతుకుదెరువు కోసం భార్య, కుమార్తెతో భాగ్యనగరానికి వచ్చి ఫిలింనగర్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. కుమారుడుని ఊర్లోనే ఉంచి చదివిస్తుండగా.. కుమార్తె (16) వీరివద్దనే ఉంటుంది. ఈనెల 16న కుమార్తెకు వాంతులు అవ్వడంతో నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షలు చేసిన వైద్యులు బాలిక 4 నెలల గర్భవతి అని చెప్పారు. ఈ విషయమై కుమార్తెను ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. తల్లి పనికి వెళ్లిన సమయంలో తండ్రి వెంకటరమణ.. భోజనంలో నిద్రమాత్రలు కలిపి తనపై అత్యాచారం చేశాడని... తాను లేచేసరికి ఒంటిపై వస్త్రాలు కూడా ఉండేవి కావని.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడని తల్లి వద్ద తన దు:ఖాన్ని చెప్పుకుంది.
పోలీసులకు ఫిర్యాదు
విషయం బయటకు తెలియడంతో వెంకటరమణ ఇంటి నుంచి పరారయ్యాడు. బిడ్డకు జరిగిన అన్యాయాన్ని తల్లి పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. భర్తపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాకినాడ పోలీసులకు సమాచారం అందించారు. కాకినాడలో వెంకటరమణను అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిని వదలొద్దు
ఏ ఆడబిడ్డ అయినా తనకు చిన్న కష్టం కలిగితే ఎక్కువ శాతం తండ్రికే చెప్పుకుంటుంది. అలాంటిది తండ్రే తన జీవితాన్ని నాశనం చేస్తే.. ఆ నరకాన్ని ఎవరితో పంచుకుంటుంది. కనుపాపను కాపాడే రెప్పలా రక్షించాల్సిన తండ్రి.. తనపై మృగవాంఛను తీర్చుకుంటే ఆ బిడ్డ ఎంత నరకం అనుభవించి ఉంటుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లితో పాటు పలువురు కోరుతున్నారు.
ఇదీ చూడండి: Rape: మనుమరాలిపై తాత అత్యాచారం కేసులో కొత్తకోణం