ETV Bharat / crime

చేపలు పట్టేందుకు వెళ్లి.. విగత జీవిగా బయటకు వచ్చాడు.. - తెలంగాణ వార్తలు

చేపలు పట్టేందుకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి... ప్రమాదవశాత్తు నీటిలో కుంటలో పడి బాలుడు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని పూడూర్​ మండలంలో చోటు చేసుకుంది.

a boy went to fishing and he died accidently at vikarabad district
చేపలు పట్టేందుకు వెళ్లి.. విగత జీవిగా బయటకు వచ్చాడు..
author img

By

Published : Mar 30, 2021, 9:25 AM IST

వికారాబాద్ జిల్లా పూడూర్​ మండలకేంద్రం శివారులోని నీటికుంటలో చేపలో కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి బాలుడు మృతి చెందాడు. పూడూరు మండలం ఎన్నెపల్లికి చెందిన కుమార్(16) కుటుంబసభ్యులతో కలిసి పూడూర్ గ్రామ శివారులో ఉన్న నీటికుంట వద్దకు వెళ్లాడు. అతని పెద్దనాన్నతో కలిసి చేపలు పట్టేందుకు సన్నద్ధమయ్యాడు.

లోతును తెలుసుకోకుండా లోపలికి వెళ్లిన కుమార్... ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మరణించాడు. కుమార్ మునిగిపోయిన సంగతి తెలుసుకోకుండా కుటంబసభ్యులు చేపలు పట్టారు. అనంతరం గమనించి కుంటలో వెతికి బయటకు తీశారు. అంతలోనే కుమార్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: బావిలో పడి ఐదుగురు కూలీలు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.