బహిర్భూమికి వెళ్లిన బాలుడు.. ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ కాల్వలో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన.. సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో చోటుచేసుకుంది.
కొత్తపల్లి (ఢీ) గ్రామానికి చెందిన దిలీప్(14).. హైదరాబాద్లో 9వ తరగతి చదువుతున్నాడు. బంధువుల శుభకార్యం నిమిత్తం.. రెండు రోజుల క్రితం తల్లిదండ్రులతో కలసి గ్రామానికి వచ్చాడు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయంలో బహిర్భూమికని.. గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వ వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో జారి పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. 3 గంటల పాటు గాలించారు. బాలుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి: బైక్ కింద పడి ఆరేళ్ల బాలుడు మృతి