తోటి ఉద్యోగులు, స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతుండగా ఒకేసారి కుప్పకూలి ఓ బ్యాంక్ ఉద్యోగి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అతని అకస్మిక మరణం కుటుంబాన్ని, మిత్రులను తీవ్రంగా కలిచివేసింది.
బోడుప్పల్ నగర పాలక సంస్థ చెంగిచర్ల వెంకటసాయి నగర్‌కు చెందిన రాంనారాయణ, నిర్మలాదేవి కుమారుడు లలిత్‌కుమార్ (27).. పోచారం మున్సిపల్ పరిధిలోని ఓ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం కావడంతో తోటి ఉద్యోగులు, స్నేహితులతో కలిసి అవుషాపూర్ శివారులోని క్రికెట్ మైదానానికి వెళ్లాడు.
పరుగు తీస్తూ..
బంతి కోసం లలిత్‌కుమార్ పరుగు తీస్తూ ఒక్కసారి కిందపడి కొట్టుకోవటం ప్రారంభించాడు. స్నేహితులు గమనించి ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు దవాఖానాకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఓఆర్ఆర్‌పై రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి