మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో ప్రమాదవశాత్తు 7 పశువులు మృతి చెందాయి. వస్రాం తండా రైతులకు చెందిన మూగజీవాలు.. వ్యవసాయ క్షేత్రంలో ఈదురుగాలుల ప్రభావంతో తెగిపడ్డ కరెంట్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాయి. ఈ ఘటనలో అవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. యాజమానుల కుటుంబ సభ్యులు పశువుల మృతదేహాలపై పడి కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను కలచివేసింది. విషయం తెలియగానే.. విద్యుత్ అధికారులు.. సరఫరాను నిలిపివేశారు.
ఇదే ప్రాంతంలో.. వారం రోజులు గా ఇలాంటి 3 ఘటనలు చోటుచేసుకున్నాయి. గాలి దుమారం సంభవించినప్పుడు అధికారులు తమ పరిధిలో కూలిపోయిన స్తంభాల వైపునకు సరఫరాను నిలిపివేయక పోవడంతోనే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఇదీ చదవండి: ఔషధాలతో నిలిపి ఉంచిన డీసీఎం దగ్ధం..