అడవుల్లో పలు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పోలీసుల ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో వివిధ మావోయిస్టు గ్రూపులకు చెందిన 36 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు.
సుకుమా జిల్లాలోని సీఆర్‌పీఎఫ్ 219 బెటాలియన్ కమాండెంట్ ఎదుట 12 మంది మావోయిస్టులు లొంగిపోగా, కిష్టారం పోలీస్ స్టేషన్లో 24 మంది లొంగిపోయారు. అడవుల్లో ఎదుర్కొంటున్న పలు సమస్యలతో పాటుగా మావోయిస్టుల భావజాలంతో విసుగు చెందే ఇలా చేసినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Husband murdered his wife: భార్య గర్భం దాల్చిందని గొంతు నులిమి చంపిన భర్త