ETV Bharat / crime

CYBER CRIMES: గత రెండు నెలల్లో ఎంత దోచుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు - తెలంగాణ వార్తలు

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు పెట్రేగిపోతున్నారు. ధనార్జనే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతూ కోట్లు కొట్టేస్తున్నారు. రోజుకు రూ.40 లక్షల వరకు స్వాహా చేస్తున్నారంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. గత రెండు నెలల్లో పోలీసులకు అందిన ఫిర్యాదుల ప్రకారం ఎంత డబ్బు పోగొట్టుకున్నారో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. అయితే పోలీసులకు అందిన ఫిర్యాదుల ప్రకారం లెక్కెలే మైండ్ పొగొడుతుంటే.. పరువు పోతుందని చెప్పుకోని వారు ఎందరో.. వారి నుంచి దోచుకున్న సొమ్ము ఎంతో అనేది లెక్కల్లో చెప్పలేం.

cyber crimes
cyber crimes
author img

By

Published : Aug 28, 2021, 6:17 AM IST

సైబర్ సెల్​కు రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. కేంద్రం ఏర్పాటు చేసిన సైబర్ సెల్ నంబర్​కు గత రెండు నెలల్లోనే 2,513 ఫిర్యాదులు రాష్ట్రం నుంచి అందాయి. దాదాపు 24కోట్ల రూపాయలు మోసపోయినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ లెక్కన నెలకు రూ.12 కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నట్లు అర్థమవుతోంది. స్థానిక పోలీస్ స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా ఈ మొత్తం ఇంకా ఎక్కువే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

రాజధానిలో గడిచిన కొన్ని నెలల్లో..

గత కొన్ని నెలలుగా సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో 2,193 కేసుల్లో రూ.37కోట్లు, హైదరాబాద్​లో 2,100 కేసుల్లో రూ.20కోట్లు, రాచకొండలో 1,600 కేసుల్లో.. రూ.7కోట్లను బాధితులు కోల్పోయారు. రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.40లక్షల వరకు సైబర్ నేరగాళ్లు నగదును తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు. పెట్టుబడులు, కస్టర్ కేర్, కేవైసీ, ఉద్యోగం, పెళ్లి పేరుతో సైబర్ నేరగాళ్లు ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.

24 గంటల్లో ఫిర్యాదు చేస్తే..

మోసపోయిన 24గంటల్లోపు బాధితులు ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోంచి డబ్బులు రికవరీ చేయొచ్చని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. స్థానిక పీఎస్​లో గానీ, సైబర్ సెల్ నంబర్ 155260 లేదా cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇళ్లల్లో దొంగతనాలు, ఇతర చోరీల్లో పోతున్న నగదు కంటే సైబర్ నేరాల ద్వారా మోసపోతున్న నగదు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఖాతాదారులు, వినియోగదారులు అప్రమత్తంగా ఉండటంతోనే సైబర్ నేరాలను నియంత్రించొచ్చని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి: Tollywood Drugs Case: మత్తుమందు లావాదేవీల గుట్టు రట్టే లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.