ETV Bharat / crime

నిషేధిత గుట్కా సరఫరా చేస్తోన్న ముఠా అరెస్ట్​ - తెలంగాణ వార్తలు

నిషేధిత గుట్కా సరఫరా చేస్తోన్న ముఠాను భువనగిరి పోలీసులు అదుపులో తీసుకున్నారు. ముగ్గురు నిందితులు పట్టుబడగా మరొకరు పరారీలో ఉన్నారు. ​20లక్షల విలువైన గుట్కా , ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, మూడు చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

gutka, yadadri bhuvanagiri distirict
gutka, yadadri bhuvanagiri distirict
author img

By

Published : Apr 26, 2021, 2:52 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రామ్​నగర్​లో ఓ దుకాణదారునికి గుట్కా ప్యాకెట్లను సరఫరా చేస్తుండగా.. ముగ్గురు నిందితులను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20లక్షల విలువైన 66 సంచుల గుట్కా, స్విఫ్ట్ డిజైర్ కారు, మూడు చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.

'కుమావత్ సురేశ్​, కుమావత్ రాహుల్, మనరాం ప్రకాశ్​, అబ్బు అనే వ్యక్తులు అడ్డదారిలో డబ్బు సంపాదనకు అలవాటు పడ్డారు. వీరు కర్ణాటకలోని బీదర్​లో తక్కువ ధరతో భారీ మొత్తంలో గుట్కా కొనుగోలు చేసి.. వివిధ వాహనాల్లో తీసుకొస్తున్నారు. ఫీర్జాదిగూడలోని ఓ గోడౌన్​లో నిల్వచేస్తారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిల్లో వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తుంటారు' అని డీసీపీ పేర్కొన్నారు.

ఫీర్జాదిగూడలోని గోడౌన్​లో నిల్వ ఉంచిన గుట్కానూ స్వాధీనం చేసుకున్నామని, అబ్బు అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్​కి తరలించినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: పార్కింగ్ స్థలంలోనే కరోనా మృతదేహాల దహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.