ETV Bharat / crime

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత - shamshabad airport news

2-dot-3-kilograms-of-gold-is-seized-at-shamshabad-airport-in-hyderabad
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
author img

By

Published : Mar 8, 2021, 11:48 AM IST

Updated : Mar 8, 2021, 12:31 PM IST

11:46 March 08

లైఫ్ జాకెట్​లో 2.3 కిలోల బంగారు బిస్కెట్లు

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా విదేశాల నుంచి తెస్తున్న బంగారాన్ని డీఆర్​ఐ, కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనల్లో దాదాపు రెండున్నర కిలోల బంగారం దొరికిందని అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ విమానంలో బంగారాన్ని తరలిస్తున్నట్లుగా అధికారులను సమాచారం అందింది. 

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే అధికారులు ఆ విమానాన్ని తనిఖీ చేశారు. ఓ సీటు కింద లైఫ్‌ జాకెట్‌లో దాచిన 2 కిలోల 300 గ్రాముల బంగారం బిస్కట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సీటులో ప్రయాణికుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. మరో ఘటనలో కువైట్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 160గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనల్లో స్వాధీనం చేసుకున్న బంగారం విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Last Updated : Mar 8, 2021, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.