ఆంధ్రప్రదేశ్‌లోని.. కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని మదార్‌పురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను చిత్తూరు జిల్లాకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం.. వారి స్వస్థలాలకు చేర్చారు.
గుర్రంకొండ మండలం తరిగొండ గ్రామానికి ఏడుగురి మృతదేహాలను.. వారి వారి స్వస్థలాలకు తరలించారు. బి.కొత్తకోట మండలం సర్కారుతోపు గ్రామానికి చెందిన నాలుగు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. కాగా.. చిత్తూరు జిల్లా మదనపల్లెకు ఆదివారం రాత్రే మూడు మృతదేహాలని తరలించినట్లు పోలీసులు వివరించారు.
జాతీయ రహదారి (ఎన్‌హెచ్-44)పై...
కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని మదార్‌పురం వద్ద జాతీయ రహదారి (ఎన్‌హెచ్-44)పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఒకే కుటుంబంలోని 12 మంది, డ్రైవరు, మెకానిక్‌తో కలిపి 14 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 8 మంది మహిళలు, అయిదుగురు పురుషులతో పాటు ఏడాది చిన్నారి ఉన్నారు.
ఇదీ చదవండి: ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు మృతి