ETV Bharat / crime

'నాన్నా..పేదవాళ్లు చదువుకోకూడదా... డబ్బున్నవాళ్లే చదువుకోవాలా..?' - AP News

ఏపీలోని చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన.. పదో తరగతి విద్యార్థిని మిస్బా ఆత్మహత్య ఘటనలో అసలు కోణం వెలుగులోకి వచ్చింది. బాగా చదవడమే తనకు ఇబ్బందిగా మారిందంటూ.. మిస్బా రాసిన కన్నీటి లేఖ బయటపడింది. తాను మొదటి ర్యాంకు సాధించడం తన తోటి విద్యార్థినికి ఇష్టం లేదంటూ ఆ లేఖలో పేర్కొంది. మిస్బా ప్రస్తావించిన విద్యార్థిని వైకాపా నేత కుమార్తె కావడం వివాదానికి ఆజ్యం పోసింది. తన కుమార్తెకే మొదటి ర్యాంకు రావాలని వైకాపా నేత ఒత్తిడి చేయడంతోనే... పాఠశాల యాజమాన్యం విద్యార్థిని మిస్బాను వేరే పాఠశాలకు టీసీ ఇచ్చి పంపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..!!

10th class student suicide in chittoor district

author img

By

Published : Mar 25, 2022, 7:49 AM IST

‘నాన్నా.. పేదవాళ్లు చదువుకోకూడదా? డబ్బున్నవాళ్లే చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లాలా?’ అంటూ ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన బాలిక మిస్బా ప్రశ్నిస్తూ.. ఆత్మహత్య చేసుకున్న ఉదంతం సంచలనంగా మారింది. బాలిక సూటిగా అడిగిన ప్రశ్నకు తండ్రి వజీర్‌ అహ్మద్‌.. ‘లేదమ్మా.. పేదవాళ్లైనా మంచి చదువులు చదవొచ్చు. పేదరికాన్ని అనుభవించి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న అబ్దుల్‌ కలాం రాష్ట్రపతి కాలేదా?’ అంటూ ధైర్యం నూరి పోసినప్పటికీ ఆమె వేదన తగ్గలేదు. ‘మరెందుకు నాన్నా.. నాకు మంచి మార్కులొస్తే స్నేహితురాలే ఓర్వలేకపోతోంది. రమేశ్ సార్‌ ఎందుకిలా వేధిస్తున్నారు? నేను మళ్లీ పాఠశాలకు వెళ్లాలంటే నా స్నేహితురాలి తండ్రి సునీల్‌ అనుమతి ఎందుకు తీసుకోవాలి?’ అంటూ తిరిగి కుమార్తె ప్రశ్నించడంతో తండ్రికి సమాధానం లేకపోయింది. వెంటాడిన మనోవేదనే ప్రతిభావంతురాలైన బాలికను మింగేసింది. బాలిక మరణంతో బాధితుల బంధువులు, తెదేపా నాయకులు, మైనారిటీ నేతలు గురువారం భగ్గుమన్నారు. బాలిక తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన వివరాలివి. పలమనేరులో సోడాలు అమ్ముకుంటూ జీవించే వజీర్‌ అహ్మద్‌, నసీమా దంపతులకు కుమార్తె మిస్బా (16), 13ఏళ్ల కుమారుడు ఉన్నారు. మిస్బాను బ్రహ్మర్షి పాఠశాలలో ఎనిమిదో తరగతిలో చేర్పించారు. ఆమెకు ఎండీ కొత్తూరు వాసి, పలమనేరులో టమాటా మండీ నిర్వహించుకునే వైకాపా కార్యకర్త సునీల్‌ కుమార్తెతో స్నేహమేర్పడింది. సునీల్‌, పాఠశాల నిర్వాహకుడు రమేశ్ మధ్య ఆర్థిక లావాదేవీలు, బంధుత్వం ఉన్నాయి. మిస్బా చదువులో ముందుండగా, సునీల్‌ కుమార్తె కాస్త వెనుకబడింది. ప్రస్తుతం వీరిద్దరూ పదో తరగతి చదువుతున్నారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో మిస్బాకు మంచి మార్కులొచ్చాయి. విషయాన్ని సునీల్‌కు ఆయన కుమార్తె చెప్పింది. దీంతో మిస్బాను పాఠశాలనుంచి పంపించాలని రమేశ్​పై సునీల్‌ ఒత్తిడి పెంచారు.

కుటుంబమంతా ఉరేసుకునేలా చేస్తా..: మిస్బాను రమేశ్​ సూటిపోటి మాటలనేవారని ఆమె తల్లిదండ్రులు వివరిస్తున్నారు. ‘సోడాలు అమ్ముకునే మీరెక్కడ? పలుకుబడి ఉన్న సునీల్‌ కుమార్తె ఎక్కడ?’ అని బిడ్డతో అనేవారని వాపోతున్నారు. ‘నేను తలుచుకుంటే నీ కుటుంబాన్ని నాశనం చేస్తా. వారంతా ఉరేసుకునేలా చేస్తా’ అని బెదిరించాడని చెబుతున్నారు. దీంతో బాలిక మానసిక వేదనకు లోనైంది. ఇది ఇలా కొనసాగుతుండగానే కొన్నిరోజుల క్రితం మిస్బా జారిపడగా మడమ వద్ద ఎముక విరిగింది. అయినప్పటికీ రమేశ్​ ఆమెను గుంజీలు తీయించారని కుటుంబీకులు వివరిస్తున్నారు. బాలిక తల్లి నసీమా పాఠశాలకు వెళ్లి ప్రశ్నించగా.. నీ కుమార్తెను వేరే పాఠశాలలో చేర్పించమంటూ రమేష్‌ గద్దించాడు. లేదంటే బడిలోకి అనుమతించేందుకు సునీల్‌తో చెప్పించాలన్నాడని తల్లిదండ్రులు వివరిస్తున్నారు. వేరే బడిలోనైనా ప్రవేశమిప్పించాలని తండ్రి వేడుకోవడంతో మరో పాఠశాల నిర్వాహకుడికి చెప్పారు. అక్కడికి వెళ్లిన మరుసటి రోజే బాలిక ఇంట్లో గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ముందుగా ఆమె రాసిన లేఖ బుధవారం వెలుగుచూసింది.

.

లేఖలో ఏముందంటే..: ‘నాన్నా.. నన్ను క్షమించు. నువ్వే నా హీరో. నా మూలంగా కుటుంబానికి ఎన్నో ఇబ్బందులొస్తున్నాయి. ఏం చేయాలో తెలియడం లేదు. చనిపోవడం ఒక్కటే సమస్యలకు పరిష్కారం. నేను నీ అంత ధైర్యమున్నదాన్ని కాదు. బాధలను పంచుకుందామంటే స్నేహితులెవరూ లేరు. నా మరణానికి నా స్నేహితురాలు.. కాదు.. కాదు నా ప్రాణస్నేహితురాలే కారణం. తనెప్పుడూ నన్ను మిత్రురాలిగా చూడలేదు. ఆమె చేసిన చెడును నమ్మలేకపోతున్నా. నేను చనిపోయినా నీ మొహంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి నాన్న’ అంటూ బాలిక లేఖ ముగించింది.

అధికారం ఉన్నవారికో న్యాయం? పేదలకొకటా..?: ‘బంగారు భవిష్యత్తు ఉన్న బిడ్డ ఆత్మహత్యతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి న్యాయం చేయకపోగా వారినే డీఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చి దోషుల్లా కూర్చోబెట్టడమేంటి? వారి ఇంట్లోకి వాళ్లనే అనుమతించకుండా సోదా చేసి ఆత్మహత్యకు ముందు రాసిన లేఖను స్వాధీనం చేసుకోవడమేంటి? ఎవరిని కాపాడటానికి ఇలా వ్యవహరిస్తున్నారు? నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం వెనక ఆంతర్యమేంటి? డబ్బు, అధికారం ఉన్నవారికో న్యాయం.. పేదలకొకటా? పాఠశాలలోకి రాజకీయాలను తీసుకొస్తారా?’ అని బాధితుల బంధువులు, తెదేపా మైనారిటీ నాయకులు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు పోలీసులను నిలదీశారు. వారి చర్యలను నిరసిస్తూ గురువారం డీఎస్పీ కార్యాలయ ఆవరణలో బైఠాయించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ పాఠశాల నిర్వహిస్తూ విద్యార్థిని మరణానికి కారణమైన రమేశ్​ను అరెస్టు చేయాలని, ఆయనపై ఒత్తిడి తెచ్చిన సునీల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని సీఐ భాస్కర్‌ తెలిపారు. గంగవరం జడ్పీ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు, ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్‌ రమేశ్​ను సస్పెండ్‌ చేస్తూ డీఈవో శేఖర్‌ ఉత్తర్వులిచ్చారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.