ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపాల్సిన సిబ్బందే చేతివాటం ప్రదర్శించారు. 18 ఏటీఎంలలో జమ చేయాల్సిన రూ.1,39,67,900 నగదును స్వాహా చేశారు.
జనగామ జిల్లాలో పలు ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన సిబ్బంది రూ.1,39,67,900 నగదు కాజేశారు. ఆడిట్ నివేదికపై చోరీ విషయం వెలుగులోకి రావడం వల్ల కంపెనీ ప్రతినిధులు.. జమగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఏటీఎం కేంద్రాల్లో నగదు పెట్టేందుకు రైటర్ బిజినెస్ సర్వీసెస్ ప్రవేటు లిమిటెడ్ కెంపెనీ బ్యాంకు అధికారులతో ఒప్పందం కుదుర్చుకొంది. ఆ సంస్థలో పనిచేస్తున్న పాసికంటి వెంకటేష్, గుర్రం ఉపేందర్, గుమ్మడువేల్లి చైతన్య కుమార్, గట్టు రాజు.. రోజూ ఏటీఎంలో నగదు నింపేవారు. ఆ సమయాల్లో చిన్న చిన్న మొత్తాల్లో నగదును స్వాహా చేసినట్లు.. ఆడిట్ నివేదికలో కంపెనీ ప్రతినిధులు గుర్తించారు.
కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదుచేశామని.. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని సీఐ మల్లేష్ తెలిపారు.
ఇవీచూడండి: సినీఫక్కీలో చోరీ... తాళ్లతో కట్టేసి ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!