ETV Bharat / city

వేయిస్తంభాలాటలో గెలుపెవరిదో? - 2019 elections

కాకతీయులు నడియాడిన నేల, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన ఓరుగల్లు పోరు ఎప్పుడూ ఆసక్తికరమే. హోరాహోరీగా సాగుతున్న లోక్​సభ బరిలో... హ్యాట్రిక్​తో పాటు భారీ మెజారిటీ కోసం కారు, పునర్వైభవానికి హస్తం, కమలం పోటీ పడుతున్నాయి. వరంగల్​ నుంచి పార్లమెంటులో అడుగుపెట్టేది ఎవరోనన్న ఉత్కంఠ నెలకొంది.

వరంగల్​ పార్లమెంటు పోరు
author img

By

Published : Apr 9, 2019, 11:29 AM IST

Updated : Apr 9, 2019, 3:44 PM IST

కాకతీయ సామ్రాజ్య రాజధానిగా వరంగల్​కు ఓ ప్రత్యేకత ఉంది. చారిత్రాత్మక కట్టడాలే కాదు... వీరోచిత పోరాటాలకు నిలయం అది. తెలంగాణ ఉద్యమంలో కాకతీయ విశ్వవిద్యాలయానిది కీలక పాత్ర. ఎస్సీ నియోజకవర్గంగా ఉన్న ఇక్కడ... 2014లో కడియం శ్రీహరి తెరాస తరఫున విజయం సాధించారు. ఆయన రాజీనామాతో వచ్చిన ఉపఎన్నికల్లో పసునూరి దయాకర్ భారీ మెజారిటీతో గెలిచారు. మరోసారి తెరాస అభ్యర్థిగా దయాకర్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి దొమ్మాటి సాంబయ్య, భాజపా తరఫున చింతా సాంబమూర్తి పోటీ చేస్తున్నారు.

వరంగల్​ పార్లమెంటు పోరు

మెజారిటీపైనే గురి

వరంగల్ లోక్​సభ పరిధిలో భూపాలపల్లి మినహా ఆరు శాసనసభ స్థానాల్లో ఘన విజయం సాధించిన తెరాస భారీ మెజారిటీనే లక్ష్యంగా... సిట్టింగ్​ ఎంపీ పసునూరి దయాకర్​ను బరిలో దింపింది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్న ధీమాతో నేతలు ఉన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు, నేతలు సమన్వయంగా పనిచేయడం దయాకర్​కు అదనపు బలంగా కనిపిస్తోంది. గతంలో 4 లక్షల 59వేల ఆధిక్యంతో దయాకర్ విజయం సాధించారు. వర్ధన్నపేటలో 99వేల ఆధిక్యంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో భారీ మెజారిటీనే సొంతం చేసుకున్న ఉత్సాహంతో 5లక్షలకుపైగా సాధించాలనే లక్ష్యంతో సమష్టిగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి సభ విజయవంతంతో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ వచ్చింది. డప్పు కొట్టి దరువేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు.

పట్టుదలే పెట్టుబడిగా

కాంగ్రెస్​ నుంచి చాలా మంది అభ్యర్థిత్వం ఆశించినప్పటికీ... మాజీ పోలీస్​ అధికారి దొమ్మాటి సాంబయ్య టికెట్​ దక్కించుకొని బరిలో నిలిచారు. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో నియోజకవర్గమంతా చుట్టి వస్తున్నారు. కాంగ్రెస్​ సంప్రదాయ ఓటుబ్యాంకు, రాహుల్ ఛరిష్మా, కనీస ఆదాయ పథకం న్యాయ్ లాభిస్తాయని సాంబయ్య ఆశిస్తున్నారు. లోక్​సభ పరిధిలో భూపాలపల్లిలో తప్ప ఎక్కడా ఎమ్మెలేలు లేకపోవడం, నేతలు ఎవరికి వారే యుమునా తీరే అన్నట్లు వ్యవహరించడం, అధికార పార్టీలోకి శ్రేణుల వలసలు ఇబ్బందికరంగా మారాయి. జాతీయ, రాష్ట్ర నాయకులు, ప్రచార తారలెవరూ సాంబయ్యకు మద్దతుగా ప్రచారానికి రాకపోవడం కార్యకర్తలను నిరాశపరిచింది.

చరిత్ర స్ఫూర్తిగా

గతంలో హన్మకొండ నుంచి ఒకసారి గెలిచిన స్ఫూర్తి, దేశమంతా మోదీ అనుకూల పవనాలు విజయతీరాలకు చేరుస్తాయనే నమ్మకంతో భాజపా... చింతా సాంబమూర్తిని పోటీకి నిలిపింది. హైదరాబాద్​ తర్వాత అంతటి స్థాయి గల నగరమైన వరంగల్​ అభివృద్ధికి నోచుకోలేదని.. కేంద్ర నిధులతో నగరం రూపురేఖలు మారుస్తానంటూ సాంబమూర్తి ప్రచారం చేస్తున్నారు. అమిత్​ షా సభతో శ్రేణుల్లో జోష్ పెరుగుతుందని ఆశించినా... చివరి క్షణలో పర్యటన రద్దు కావటం వల్ల అభ్యర్థి కొంత నిరాశ చెందారు. స్థానికేతరుడనే విమర్శలు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

నేతల సమన్వయంతో అధికార పక్షం ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే... కాంగ్రెస్, భాజాపాలు మాత్రం సాదాసీదాగానే చేసినట్టు కనిపించింది. పోలింగ్​కు ఒక్కరోజే ఉన్నందున... ఏప్రిల్​ 11న మరి ఓటరన్న కారెక్కుతాడా? చేయందుకుంటాడా? కమలాన్ని వికసింపచేస్తాడో వేచి చూడాలి.

ఇవీ చూడండి: సికింద్రాబాద్ బరిలో 'హస్త' సన్యాసమేనా?

Last Updated : Apr 9, 2019, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.