వరంగల్ ప్రజల ఇలవేల్పు శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తులెవరూ లేకుండానే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. భద్రకాళీ భద్రేశ్వర కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పరిసరాల్లో అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు.
ఇవీ చూడండి: 'ప్రవేశ పరీక్షల దరఖాస్తు స్వీకరణ గడువు పెంపు'