మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెరాస ఆవిర్భావ వేడుకలు జరిగాయి. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లు పార్టీ జెండా ఎగరవేసి కార్యకర్తలకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 20 ఏళ్ల క్రితం ఒంటరిగా ఉద్యమం మొదలుపెట్టి నేడు.. రాష్ట్రం సాధించి కోట్లాది మంది ఆభిమానం సంపాదించుకున్న నాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ విజయపథంలో దూసుకుపోతోందని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు.
ప్రజా సంక్షేమం కోసం అడుగులు వేస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమే అని ఆమె వ్యాఖ్యానించారు. మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి.. తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని మంత్రి అన్నారు.
ఇదీ చూడండి: వలస కూలీల సమస్యలను తీర్చిన రాచకొండ సీపీ