ETV Bharat / city

'తొమ్మిదో ప్యాకేజీ అంచనాలను సవరించిన సర్కారు'

author img

By

Published : May 8, 2020, 3:32 PM IST

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీ అంచనాలను సర్కారు సవరించింది. మధ్యమానేరు నుంచి ఎగువమానేరుకు నీటిని తరలించే పనుల అంచనా వ్యయాన్ని సవరించాలంటూ నీటిపారుదల ఇంజినీర్ ఇన్​చీఫ్.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

The government revised the kaleshwaram ninth package estimates
'తొమ్మిదో ప్యాకేజీ అంచనాలను సవరించిన సర్కారు'

కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీ అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. మధ్యమానేరు నుంచి ఎగువ మానేరుకు నీటిని తరలించేందుకు సర్కారు... గతంలో రూ. 911కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. మధ్యమానేరు నుంచి 120 రోజుల పాటు 11.635 టీఎంసీల నీటిని ఎగువమానేరుకు తరలించే పనులకు అంచనా వ్యయాన్ని రూ. 996 కోట్లకు సవరించాలని నీటిపారుదల ఇంజినీర్ ఇన్​చీఫ్​ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈఎన్సీ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీ అంచనా వ్యయాన్ని సర్కారు రూ. 996 కోట్లకు పెంచింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చూడండి: పాఠశాల విద్యార్థుల ఘర్షణ.. కర్రతో ఇద్దరిపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.