ETV Bharat / city

తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో రాకపోకలు బంద్! - Telangana Maharashtra Border Lock down

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించకుండా సరిహద్దులు మూసేయడం వల్ల రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి.

Telangana Maharashtra Border Lock down
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో రాకపోకలు బంద్!
author img

By

Published : Mar 23, 2020, 11:17 PM IST

తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో రాకపోకలు బంద్!

తెలంగాణ లాక్​డౌన్ కారణంగా జిల్లాలో జనసంచారం చాలావరకు తగ్గింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం బ్యారేజీ అంతరాష్ట్ర వంతెనను పోలీసులు మూసేశారు. జిల్లాలోని మహదేవపురం, పలిమెల, మలహార్, మహామత్తారం, కాటరం మండలాల్లో లాక్​డౌన్ పూర్తిగా అమలు చేస్తున్నారు. తెలంగాణతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడం వల్ల ఆ రాష్ట్ర సరిహద్దులు మూసేసి ఎలాంటి వాహనాలు, రాకపోకలు లేకుండా నిలిపేశారు.

బయట తిరగొద్దు

మేడిగడ్డ బ్యారేజీలో సీఆర్పీఎఫ్ పోలీసులు క్యాంపు వేసి పహారా కాస్తున్నారు. నిత్యావసర వస్తువుల కోసం జనాలు నిర్ణీత సమయంలోనే బయటకు రావాలని, ప్రజలు బయట తిరగొద్దని కాటారం డీఎస్పీ బోనాల కిషన్, మహదేవపురం ఎస్సే బెల్లం సత్యనారాయణ హెచ్చరించారు.

ఆగిపోయిన ఇసుక లారీలు

జిల్లాలోని మహదేవపురం మండలానికి ఇసుక రవాణా కోసం వచ్చిన లారీలు, ఇసుక క్వారీ సిబ్బంది లాక్​డౌన్ వల్ల మండల కేంద్రంలోనే ఇరుక్కుపోయారు. లారీ డ్రైవర్లు వంట కోసం తెచ్చుకున్న సరుకులతో పాటు చేతిలోని డబ్బులు కూడా అయిపోయాయి. గ్రామంలోకి వెళ్లి సరుకులు తెచ్చుకోవడానికి ప్రవేశం లేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారు. ఇసుక కోసం వచ్చిన ఖాళీ లారీలు, లోడు లారీలు లాక్​డౌన్​ కారణం వల్ల ఆగిపోవడం వల్ల మండల కేంద్రమంతా లారీలతో నిండిపోయింది.

ఇదీ చూడండి : లాక్​డౌన్​ను లెక్కచేయని ప్రజలు- మార్కెట్లు రద్దీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.