Krishnastami: శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని వరంగల్ నగరంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పోతననగర్ లోని శ్రీ భగవాన్ మురళీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణునికి ఉదయం అభిషేకాలు నిర్వహించారు. ఇక్కడ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఓం నమో భగవతి వాసుదేవాయ అనే నామస్శరణ దేవాలయాలలో మార్మోగింది.
అనంతరం స్వామివారిని అందంగా అలంకరించిన అర్చకులు స్వామివారికి 108 నైవేద్యాలను సమర్పించారు. వీటిలో పండ్లు, డ్రైప్రూట్లు, స్వీట్లు మెుదలైనవి ఉన్నాయి. లోకనాయకుడికి మంగళ హారతులు ఇచ్చారు. శ్రీకృష్ణుని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. నీటి తొట్టె లాంటిది చేసి అందులో రాధాకృష్ణుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఈ విగ్రహాలను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఈ తొట్టెను కొన్ని రకాల పుష్పాలతో అలంకరించారు. వీటిని చూడడానికి భక్తులు వచ్చారు. స్థానిక రోడ్డులోని ఇస్కాన్ టెంపుల్ లో శ్రీకృష్ణ సుభద్ర బలరాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ఇవీ చదవండి: