వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని శాకాంబరి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలోని అన్నపూర్ణ అమ్మవారికి బుధవారం ఉదయం నుంచే పంచామృతాభిషేకాలు, అష్టోత్తర శతనామావళి నిర్వహించి ప్రత్యేక అలంకరణలు చేశారు. మధ్యాహ్నం భక్తులు తెచ్చిన కురగాయలతో... ఆలయ పురోహితులు అమ్మవారిని శాకాంబరి రూపంలో అలంకరించారు. అనంతరం అమ్మవారికి సహస్ర నామార్చన పారాయణం నిర్వహించారు. ఉదయం నుంచే దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ పురోహితులు తెలిపారు.